Yadadri Temple No Cleanness : పవిత్రమైన ప్రదేశంలో.. ఈ అపరిశుభ్రత ఏమిటీ స్వామి..
Updated: May 13, 2023, 7:25 PM |
Published: May 13, 2023, 7:25 PM
Published: May 13, 2023, 7:25 PM
Follow Us 

Yadadri Lakshminarasimha Swamy Temple : ఎన్నో హంగులతో యాదాద్రీశుని ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. భక్తులను, దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. కాని అక్కడి శుభ్రతలోనూ, పారిశుద్ధ్యంలోనూ, భద్రతలోనూ డొల్లతనం పూర్తిగా కనిపిస్తోంది.

1/ 8
Yadadri Lakshminarasimha Swamy Temple : ప్రపంచ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అందుకు తగ్గట్లే నిర్మాణాలు కూడా ఉన్నాయి. దీంతో యాత్రికులు, పర్యాటకుల తాకిడి రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. ఇటీవల స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2 కోట్లను సైతం దాటింది. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేసిన.. అక్కడి యాడా అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ వారి అలసత్వంతో భద్రతలోనూ, శుభ్రతలోనూ పూర్తి డొల్లతనం కనిపిస్తోంది. దీంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. కొండ కింద కల్యాణకట్ట, వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, అన్న ప్రసాద కేంద్రం వద్ద పందుల స్వైర విహారం చేస్తున్నాయి. భక్తులు, పర్యాటకులు ఆహ్లాదంగా కోసం ఏర్పాటు చేసిన గ్రీనరీలో మద్యం సీసాలు, తినిపడేసిన కాగితపు ప్లేట్లు కనిపిస్తున్నాయి. కొందరు భక్తులు అయితే వాటిని ఫోన్లలో రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. యాదాద్రి దేవస్థానం నిర్వాహన తీరు ఇది అని చెప్పి షేర్లు చేస్తున్నారు. ఈ విషయాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి.. అధికారులను దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఈ సమస్యలపై త్వరితగతిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టిపెడితే.. ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
Loading...
Loading...
Loading...