యువగళం పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేశ్
Published on: Jan 25, 2023, 4:23 PM IST |
Updated on: Jan 25, 2023, 4:23 PM IST
Updated on: Jan 25, 2023, 4:23 PM IST

యువగళం పేరిట 400 రోజుల సుధీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబసభ్యులు ఆశీర్వచనం అందించి పంపించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు బయలుదేరే ముందు తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో లోకేశ్ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఏడాదికి పైగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమైన లోకేశ్ కుమారుడు దేవాన్ష్‌ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. భార్య బ్రాహ్మణి బొట్టు పెట్టి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లోకేశ్ వాహనం ఎక్కేటప్పుడు తల్లి భువనేశ్వరి వెంట నడవగా, తండ్రి చంద్రబాబు ఆయనకు ఎదురొచ్చారు. అత్తామామ నందమూరి బాలకృష్ణ, వసుంధరా దేవిల ఆశీర్వాదంతో పాటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నందమూరి, నారా కుటుంబసభ్యుల ఆత్మీయతల మధ్య లోకేశ్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఆయన సమాధి వద్దకు వెళ్లారు. లోకేశ్ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళుల అనంతరం తిరిగి కడప బయలుదేరి వెళ్లారు.
1/ 16
పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బొట్టు పెట్టిన భార్య నారా బ్రాహ్మణి

Loading...