చిన్న వయసులోనే అసెంబ్లీలోకి ఎంట్రీ - అధ్యక్షా అంటూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన నాయకులు వీరే
Updated: Nov 20, 2023, 11:25 AM |
Published: Nov 20, 2023, 11:25 AM
Published: Nov 20, 2023, 11:25 AM
Follow Us 

Leaders Entered into Politics at a Young Age : ప్రస్తుతం హైదరాబాద్లో చక్రం తిప్పుతున్న పలువురు రాజకీయ నేతలు.. చిన్న వయసులోనే ఈ రంగంలోకి వచ్చారని మీకు తెలుసా..? విద్యార్థి నాయకులుగా మొదలుపెట్టి.. కార్మిక నేతలుగా ఎదిగి.. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులుగా తమదైన ముద్ర వేస్తున్న ఆ నేతలెవరో ఇప్పుడు చూద్దాం.

1/ 6
Leaders Entered into Politics at a Young Age : ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ప్రచారాలతో హోరెత్తుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈసారి బరిలో నిలిచిన నేతల్లో చాలా మంది సీనియర్ నాయకులే ఉండగా.. కొంతమంది యువత సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి బరిలో దిగారు. మూడు పదుల వయస్సులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి 'అధ్యక్షా' అనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఏదేమైనా.. యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెబుతుంటారు. కానీ ఆ రంగంలో రాణించడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. రాజకీయాల్లో కొనసాగాలంటే పట్టుదల, నిబద్ధత అవసరం. ప్రస్తుతం భాగ్యనగరంలో పలు పార్టీల్లో చక్రం తిప్పుతున్న పలువురు నేతలు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అన్నీ అనుకూలించి అసెంబ్లీ గడప తాకారు. కార్మిక నేతలుగా.. విద్యార్థి నాయకులుగా.. తర్వాత ప్రజా ప్రతినిధులుగా తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో అధ్యక్షా అంటూ ప్రత్యర్థి నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Loading...
Loading...
Loading...