పండ్లు, కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే
Updated: May 16, 2023, 1:53 PM |
Published: May 16, 2023, 1:53 PM
Published: May 16, 2023, 1:53 PM

how to identify the spoiled food in fridge : ప్రస్తుతకాలంలో చాలా మంది పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఒకేసారి వారానికి సరిపడా తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వఉంచుతున్నారు. అయితే కొన్నిసార్లు ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు పాడయిపోతుంటాయి. కానీ వాటిని మనం కొన్ని సార్లు గుర్తించలేం. అలాంటప్పుడు పాడయిపోయిన పదార్థాలను ఎలా గుర్తించాలి అనే విషయాలను తెలుసుకుందాం

1/ 11
how to identify the spoiled food in fridge : మన బిజీ లైఫ్‌లో ఎప్పుడూ ఫ్రెష్ ఫుడ్ తినాలంటే కష్టమే. మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా కొన్నిసార్లు దీనికి సహకరించకపోవచ్చు. అందుకే మనం పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తాం. ఈరోజు చేసిన కూరలు కానీ ఇతర ఆహారపదార్థాలు కానీ మిగిలిపోతే మనం ఫ్రిడ్జిలో నిల్వ ఉంచుతాం. అలాగే ఇతర పదార్థాలను కూడా పాడైపోకుండా కొన్నిరోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిడ్జిలో పెడతాం. ప్రస్తుత కాలంలో ఫ్రిజ్‌లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి చిన్న వస్తువును తీసుకెళ్లి దాంట్లోనే భద్రపరుస్తుంటాం. చిన్న మిరపకాయ నుంచి పెద్ద గుమ్మడికాయ వరకు ఫ్రిజ్లోనే నిల్వ ఉంచుతాం. చిన్న పిల్లలు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం, చాక్లెట్లు ఫిజ్‌లో దాచుకుని తింటుంటారు. మాంసం ఇలా రకరకాల పదార్థాలు పాడయిపోకుండా ఫ్రిజ్లోనే నిల్వ ఉంచుతాం. అయితే ఫ్రిజ్‌లో పెట్టి వాటిని బయట పెట్టిన కొద్దిసేపటికే పదార్థాల రుచి మారడం, ఇవి పాడయిపోవటం జరుగుతుంది. మరి మీరెప్పుడైనా అలాంటి స్థతిని గమనించారా? ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలను వాటి రుచి చూడకుండానే అవి పాడయిపోయాయని చెప్పొచ్చు.

Loading...