అమెరికా అడవుల్లో అద్భుత శివాలయం- కరెంట్, ఆధునిక పరికరాలు లేకుండానే నిర్మాణం!
Hawaii Hindu Temple : అరణ్యంలో పచ్చటి చెట్ల మధ్య ప్రకృతి అందాలకు చిరునామాగా నిలుస్తోంది అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న హిందూ ఆలయం. ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా చేతితో నిర్మించిన ఈ శివుని ఆలయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఆధ్మాత్మిక ప్రశాంతతకు పెట్టింది పేరులా నిలుస్తోంది కవాయి క్షేత్రం

1/ 26
Hawaii Hindu Temple : చుట్టూ పచ్చని చెట్లు... ధారాళంగా పారే నది... పక్షుల కిలకిలా రావాలు... మధ్యలో ఓ అద్భుతమైన హిందూ ఆలయం. పురాతనమైన కట్టడాలు, కళాకృతులతో ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఆకర్శిస్తోంది. అమెరికాలోని అతిపెద్దదైన హవాయి ద్వీపంలో ఈ కవాయి క్షేత్రం ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిరమణీయత, అద్భుతమైన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఈ ఆలయానికి ఆకర్షిస్తున్నాయి. 1968లో పరమాచార్య సదాశివానంద పాలనిస్వామి ఆయన గురువు సద్గురు శివాయ సుబ్రమణ్యస్వామితో కలిసి హవాయిల ప్రాంతానికి వచ్చారు. 1990 లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభంకాగా...మధ్యలో నిలిపివేశారు. తిరిగి స్వామీ సద్గురు మరణాంతరం కట్టడం మొదలుపెట్టారు. 3.2 మిలియన్ పౌండ్ల గ్రానైట్‌ను ఉపయోగించి, 3 వేల 6 వందల రాతి స్తంభాలను, దూలాలను నిర్మించారు. ఈ ఆలయం అంతటిలో అత్యంత ప్రాముఖ్యమైంది... 7 వందల పౌండ్ల స్వచ్ఛమైన రాతితో నిర్మించిన శివలింగం. శివుడిపై భక్తికి నిదర్శనంగా దీనిని నిర్మించారు.
Loading...
Loading...
Loading...