Hanuman Jayanthi Special Story : హనుమాన్ జయంతి ప్రత్యేకతలేంటి.. ఈరోజు ఏం చేయాలి.. ?
Updated: May 14, 2023, 10:09 AM |
Published: May 14, 2023, 10:09 AM
Published: May 14, 2023, 10:09 AM

Hanuman Jayanthi Special Story : హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి. కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి.

1/ 7
Hanuman Jayanthi Special Story : నేడు హనుమాన్ జయంతి. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి రోజున నిర్వహిస్తుంటారు. కేరళలో మాత్రం మార్గ శిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతారు. తెలుగు హనుమాన్ జయంతి పర్వదినాన.. ఆ భగవంతుడిని స్మరిస్తూ నేలపై నిద్రిస్తే చాలా మంచిది. అలా నేలపై నిద్రిస్తే.. ఆరోగ్య సిద్ధితో పాటు వాత రోగాలు దూరం అవుతాయి. శరీరం, మనస్సుపై నియంత్రణ కలుగుతుంది. హనుమంతుడు శివుని అంశతో పుట్టాడని పండితులు చెబుతుంటారు. రామాయణం ప్రకారం.. శ్రీ రామ చంద్రునికి ఆంజనేయ స్వామి విశ్వాస పాత్రుడు, అత్యంత విధేయుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. అసలు ఈ రోజు ఏం చేయాలంటే..?

Loading...