Gundlapally Village in Jagtial : కలతలుండవు.. కలహాలుండవు.. 8 ఏళ్లుగా ఠాణా మెట్లెక్కని పల్లె
Updated: May 18, 2023, 3:36 PM |
Published: May 18, 2023, 3:36 PM
Published: May 18, 2023, 3:36 PM

Gundlapally Village in Jagtial : కలతలు, కలహాలకు దూరంగా.. ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా ఆ గ్రామం నిలుస్తోంది. కలిసి ఉంటే.. కలదు సుఖం అనే మాటను నిజం చేస్తూ.. కష్టం, సుఖంలో గ్రామస్థులంతా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. చిన్న గ్రామమైనా.. మహాత్ముడు కన్న కలలను సాకారం చేస్తూ అభివృద్ధి పథంలో కొనసాగుతోందా పల్లె. ఠాణా మెట్లు ఎక్కని ఆ గ్రామం.. ఎక్కడుందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

1/ 32
Gundlapally Village in Jagtial : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని గూండ్లపల్లి గ్రామమిది. ఎటు చూసినా పచ్చదనం, చక్కని రహదారులతో ఆకట్టుకుంటోంది. ఈ ఊళ్లో 150 నివాసాలుండగా.. 508 మంది నివసిస్తున్నారు. 2018లో నూతన పంచాయతీగా ఏర్పడింది. చిన్న గ్రామం కావటంతో ఏ పనికైనా.. అభివృద్ధి పనులు చేయాలన్నా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన రూ.కోటిన్నర నిధులతో ఊరిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నారు. దీంతో ఎటు చూసినా కాంక్రీట్ రహదారులే కనిపిస్తాయి. గ్రామంలో క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాట్, వైకుంఠదామం నిర్మించుకున్నారు. ఇలా గ్రామస్థులంతా సంఘటితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అభివృద్ధితో పాటు.. ఈ గూండ్లపల్లి గ్రామానికో ప్రత్యేకత ఉంది. ఈ 8 ఏళ్లలో గ్రామస్థులెవరూ పోలీసు ఠాణా మెట్లు కూడా ఎక్కలేదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా.. గొడవలు జరిగినా గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటున్నారు. ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు ఐక్యత చాటుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Loading...