Governor Tamilisai Bhadradri Tour : రేపు భద్రాద్రికి గవర్నర్.. మళ్లీ రైలు ప్రయాణమే
Updated: May 16, 2023, 1:28 PM |
Published: May 16, 2023, 1:28 PM
Published: May 16, 2023, 1:28 PM

Governor Tamilisai Bhadradri Tour : భద్రాచలంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మరోసారి పర్యటించనున్నారు. ఏడాది వ్యవధిలో ఆమె నాలుగో పర్యాయం భద్రాద్రి వెళ్తున్నారు. ఈసారి కూడా గవర్నర్ రైలు మార్గం ద్వారానే భద్రాద్రికి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారుజామున కొత్తగూడెం చేరుకోనున్నారు. అక్కడి నుంచి 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి గెస్ట్‌హౌజ్‌కు వెళ్లనున్నారు. అక్కడ టిఫిన్ చేశాక అనంతరం రోడ్డు మార్గంలో ఉదయం 8.40 గంటలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకుంటారు. అనంతరం భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలలో గవర్నర్ పాల్గొననున్నారు.

1/ 8
Governor Tamilisai Bhadradri Tour : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి బుధవారం భద్రాద్రిలో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలులో బయల్దేరి బుధవారం ఉదయం 4.15కు కొత్తగూడెం చేరుకొనున్నారు. అక్కడి నుంచి 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి గెస్ట్‌హౌజ్‌కు వెళ్లనున్నారు. అక్కడ టిఫిన్ చేశాక అనంతరం రోడ్డు మార్గంలో ఉదయం 8.40 గంటలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకుంటారు. అనంతరం గవర్నర్ అక్కడి నుంచి బయలుదేరి వీరభద్ర ఫంక్షన్ హాలులో 9.10కు ‘గిరిజనుల ఆరోగ్యం’పై అవగాహన సదస్సుకు ఆమె హాజరవుతారు. అలాగే గిరిజనులతో తమిళిసై మమేకం కానున్నారు.
అదే విధంగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరగనున్న రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని 12.15కు ఐటీసీ అతిథిగృహానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేరుకుంటారు.
అక్కడ భోజనానంతరం మధ్యాహ్నం 1.20గంటలకు కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథిగృహానికి వచ్చి అనంతరం రోడ్డు మార్గాన 2.30కు ఖమ్మం ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. ఖమ్మంలో జిల్లాలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రైలెక్కి రాత్రి 10.35కి హైదరాబాద్‌కు తమిళిసై బయల్దేరుతారు. సంవత్సరం వ్యవధిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నాలుగో పర్యాయం భద్రాచలం వస్తున్నారు. గపర్నర్ పర్యటన వేళ అధికారులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలకు చెందిన 50 మంది తమ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. భద్రాచలంలో కలపాలని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల వాసులు గవర్నర్‌ను కలిసి తమ సమస్యలను తెలుపనున్నారు. పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలతో పాటు గోదావరి వరదల సమయంలో జరిగే నష్టాన్ని వారు వివరించనున్నారు.

Loading...