Fish Food Festival in Telangana : రాష్ట్రంలో మూడ్రోజుల పాటు 'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్'
Updated: May 17, 2023, 7:36 PM |
Published: May 17, 2023, 7:36 PM
Published: May 17, 2023, 7:36 PM

Fish Food Festival in Telangana : వస్తోందసలే.. మార్గశిర మాసం. ఆ మాసంలో మీనాలకు అధికం డిమాండ్ ఉంటుంది. అందుకు జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తుంది. ఆ ఫెస్టివల్లో రాష్ట్రంలో లభించే అన్ని చేపలను ఎగ్జిబిషన్ తరహా.. సందర్శనకు ఉంచుతారు. ఇంకా 20 నుంచి 30 రకాల ఫిష్ వంటకాలను రాష్ట్ర ప్రజానికానికి రుచి చూపించనున్నారు. ఇప్పుడు ఆ ఫిష్ రకాలు.. ఏఏ రకాల ఫిష్ వంటకాలు ఉన్నాయో తెలుసుకుందాం?

1/ 12
Fish Food Festival in Telangana : మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 8,9,10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫెస్ట్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫుడ్ ఫెస్టివల్లో చేప ఉత్పత్తుల గురించి, చేపలతో తయారు చేసే రకరకాల వంటకాల గురించి అందరికీ తెలిసే విధంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వాగుల్లోనూ, చెరువుల్లోనూ, నదీ జలాల్లోనూ ప్రత్యేకంగా లభ్యమయ్యే చేపల గురించి వివరించనున్నారు.
కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది. ఆ చేప రుచిలోనూ ఆమోఘంగా ఉంటుంది. అలాగే బొచ్చు చేపలతో పులుసు పెట్టుకొని.. ఆ ముక్కను తింటే అంతకంటే భాగ్యం లేనే లేదు అంటారు తెలంగాణ ప్రజానీకం. అలాగే వాలుగు, బంగారుతీగ, చిన్న చేపలు వంటి చేపల ఉత్పత్తులు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. అలాగే చేపలు, రొయ్యలతో తయారు చేసిన ఫిష్ ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో 20 నుంచి 30 రకాల ఫిష్ వంటకాలను రుచి చూడవచ్చు. మరి ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌కు వెళ్లేముందు ఓసారి అక్కడ ఎలాంటి రకాల చేపలు ఉంచుతారు.. ఏయే ఫిష్ బిర్యానీలు దొరుకుతాయి.. వాటి స్టోరీ ఏంటో ఓ సారి తెలుసుకుందామా..?

Loading...