అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో వారే కీలకం
Updated: Nov 12, 2023, 11:28 AM |
Published: Nov 12, 2023, 11:28 AM
Published: Nov 12, 2023, 11:28 AM
Follow Us 

Election Commission Released Telangana Voters List : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతి ఐదేళ్లకు ఓసారి వచ్చే ఎన్నికల్లో నచ్చిన నేతలను ఎన్నుకునే తరుణం మరోసారి ఓటర్ల చేతికి వచ్చింది. ప్రస్తుతం నాయకుల తలరాత రాసే అవకాశం ఓటర్ల చేతిలోనే ఉంది. ఈసీ తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కన్నా 3 వేల 287 మంది మహిళలు ఎక్కువగా నమోదయ్యారు. ఈసారి ఎన్నికల్లో.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో.. మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.

1/ 8
Election Commission Released Telangana Voters List : రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 26లక్షల 18వేల 205మంది ఓటర్లు ఉన్నట్లు.. ఎన్నికల సంఘం ప్రకటించింది. గత అక్టోబరు 31 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిన ఈసీ.. వచ్చిన దరఖాస్తులను నవంబరు 10 వరకు పరిష్కరించి జిల్లాలవారీగా తుదిఓటర్ల జాబితాలను కలెక్టర్లు ప్రకటించారు. పురుషులు కోటి 62 లక్షల 98 వేల 418 మంది, మహిళలు కోటి 63 లక్షల 17 వందల ఐదు మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 2 వేల 676, సర్వీసు ఓటర్లు 15 వేల 406 మంది ఉన్నారు. నవఓటర్లు రికార్డు స్థాయిలో.. 9 లక్షల 99 వేల 667 మంది నమోదయ్యారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాతో పోలిస్తే 8 లక్షల 85 వేల 478 మంది ఓటర్లు పెరిగారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో.. మహిళల కన్నా పురుషులు 28 వేల 154 మంది ఎక్కువగా ఉండగా.. తాజాగా మహిళలు అధిగమించారు. పురుష ఓటర్ల కన్నా 3 వేల 287 మంది మహిళలు ఎక్కువగా నమోదయ్యారు. ఈసారి ఎన్నికల్లో.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో.. మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,551 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా సిద్దిపేట నుంచి 757 దరఖాస్తులు రాగా అత్యల్పంగా మక్తల్ నుంచి 5 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. త్వరలో ఓటరు స్లిప్పుల పంపిణీ చేయనున్నారు.
Loading...
Loading...
Loading...