ఎలక్షన్ కోడ్‌తో పెట్టుకోవద్దు- ఉల్లంఘిస్తే కేసులు వదలవు
EC Focus on Telangana Elections : తెలంగాణ ఎన్నికలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపడుతుంది. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, తదితర అంశాలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. నెల రోజుల్లోనే పోలీసులు 426 కేసులను నమోదు చేశారు.

1/ 9
EC Focus on Telangana Elections : ఎలక్షన్ కమిషన్ అన్నీ గమనిస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నవేళ.. ‘ఏం ఫర్వాలేదులే’ అన్న ధోరణితో ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా కేసులు తప్పవు. ఒక్కసారి కేసు నమోదైతే అది కొన్ని సంవత్సరాలపాటు వెంటాడుతూనే ఉంటుంది. నేరం నిరూపితమైతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎన్నికల ప్రచారం చేసినా.. అనుమతి లేకుండా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించినా కేసు నమోదు చేస్తున్నారు. చివరకు ప్రచారానికి సంబంధించి వాల్ పోస్టర్లు అతికించినా.. పెద్దశబ్దంతో డీజేలు పెట్టినా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా.. ప్రభుత్వ పథకాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకున్నా.. కేసులు నమోదవుతాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత నెల 10 నుంచి ఈ నెల 10 వరకు (నెల రోజుల్లో) తెలంగాణలో ఈ తరహా కేసులు 426 నమోదు చేశారు. చాలామంది కేసులది ఏముందిలే.. అని చాలామంది బహిరంగగానే నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. కానీ అవి నమోదైతే కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సదరు నేతలు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ కేసుల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని ప్రభుత్వ పథకాల వంటివి పొందాలన్నా కేసుల ప్రస్తావన తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసుశాఖలోకి ఎంపిక కావాలంటే ఈ కేసులు కచ్చితంగా అడ్డంకిగా మారతాయి. ఇక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఈ కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించడం అవసరం.
Loading...
Loading...
Loading...