Mental Health Symptoms : తరచూ తలనొప్పి.. దానికి సంకేతమట
Updated: May 25, 2023, 2:16 PM |
Published: May 25, 2023, 2:16 PM
Published: May 25, 2023, 2:16 PM

Mental Health Symptoms : ఆరోగ్యం బాగానే ఉన్నా ఎందుకో తెలియని అలసట. ఏ పని చేయాలన్నా అనాసక్తి. ఇలాంటి లక్షణాలను ఈజీగా తీసుకోవద్దని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఇవి మానసిక అనారోగ్యానికి సంకేతాలట. మరి మీలోనూ ఈ లక్షణాలు ఉన్నాయా..?

1/ 8
Mental Health Symptoms : ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఎందుకో తెలియని అలసట. ఏ పని చేయాలన్నా ఎందుకో నిరాసక్తత. అంతా బాగానే ఉన్నా తరచూ నీరసం. మనకు ఇలా జరుగుతోందని ఈ విషయం ఎవరికైనా చెబితే అంతా నీ భ్రమ అంటారు. కానీ ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే నిజంగానే మీలో సమస్య ఉన్నట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇది శారీరక సమస్య కాదని.. మానసిక సమస్య అని చెబుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలంటే..?
తరచూ తలనొప్పిగా అనిపిస్తుందా? అలా వచ్చినన్ని సార్లు అనారోగ్యమే కాదు. కాబట్టి తరచూ ట్యాబ్లెట్లు వేసుకుని ఊరుకోవద్దు. ఇక మెడ, తల లాగినట్లు అనిపిస్తోందా.. ఇది శారీరక శ్రమ వల్ల కాదట.. ఒత్తడి పెరిగినా ఇలాగే అనిపిస్తుందట. చిన్నచిన్న విషయాలకు తికమక పడటం, మరచిపోవడం దేనిమీదా మనసు లగ్నం కాకపోవడం ఇలాంటివన్ని మానసిక అలసటకు చిహ్నాలు.
ఊపిరి ఆగుతున్నట్లు.. గుండె బరువు అనిపించడం ఇలాంటివి.. అన్ని సార్లు.. శారీరక సమస్య కాదు. మెదడులో అడ్రినలిన్, కార్టిసాల్ హార్మోన్లు పెరిగినా అవి ఛాతీనొప్పి, విపరీతమైన చెమటకు దారి తీస్తాయి.
ఆఫీసులో, ఇంట్లో కుర్చీలో కూర్చొని పని చేస్తారు. కూర్చొని చేసే పనేగా ఈ ఒళ్లు నొప్పులు ఏంటి..? ఏదో బరువులు మోసినట్లు ఈ బాధేంటి అనిపిస్తోందా..? ఒళ్లంతా ఎవరో కొట్టినట్లు విపరీతమైన నొప్పిగా ఉంటోందా..? అయితే దానికి కారణం భావోద్వేగ ఒత్తిడి అంట. దీనివల్ల కీళ్లు, కండరాలతోపాటు కొన్ని సార్లు గుండెల్లోనూ పొడుస్తున్నట్లు నొప్పికి దారితీస్తుందట.
సినిమాలు.. సీరియళ్లు చూస్తూ చిన్నపాటి సీన్‌కే తెగ ఏడిచేస్తుంటారు కొందరు. విపరీతమైన కామెడీ సీన్ వస్తున్నా నవ్వకపోవడం.. బాధకు రియాక్ట్ అవ్వకపోవడం.. కారణం లేకుండా ఊరికే ఏడవడడం.. ఇవన్నీ మానసిక అలసటకు చిహ్నమేనట. నేనెందుకూ పనికి రాననే భావన.. నా వల్ల ఏం కావడం లేదన్న ఫీలింగ్ కలుగుతోందంటే.. మీ మనసు విశ్రాంతత కోరుకుంటున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.సరిగ్గా నిద్ర పట్టకపోవడం.. ఆకలి మందగించడం.. ఊపిరి భారంగా అనిపించడం.. ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయంటే.. ఒత్తిడి కారణాలను ఓసారి గమనించండి. వాటి నుంచి బయటపడే మార్గాలు ఆలోచించుకోండి. కారణం లేకుండా ఇలాంటి భావనకు మీరు గురవుతుంటే వీలైనంత త్వరగా మానసిక నిపుణులను సంప్రదించి వారి సూచనలు తీసుకోండి.

Loading...