Crowd Of Devotees At Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు
Updated: May 14, 2023, 4:06 PM |
Published: May 14, 2023, 4:06 PM
Published: May 14, 2023, 4:06 PM

Yadadri Lakshminarasimha Swamy Temple : ఆదివారం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసిన భక్త జనంతో కొండ మొత్తం ఎంతో ఆహ్లాదంగా మారింది. సెలవు రోజుతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూలైన్లలో నిల్చున్న భక్తులు.. ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు.. ప్రత్యేక దర్శనానికి అయితే గంట సమయం పడుతుండడంతో ఆ చలువ పందిళ్లలో నిలబడి సేదతీరి.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం.

1/ 9
Yadadri Lakshminarasimha Swamy Temple Devotees Crowd : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అదే సాధారణ రోజులుతో పోల్చుకుంటే.. యాదాద్రి దేవస్థాన పరిసర ప్రాంతాలు భక్తులు, పర్యాటకులతో సందడిగా మారాయి. భక్తులు ఎక్కువ మంది రావడంతో ఆలయంలో ప్రవేశించే క్యూలైన్లలో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు.. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ఎక్కువ మంది కొండ మీదకి తరలిరావడంతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులు తాకిడి అధికంగా ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా కొండపైన క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు లక్షీనరసింహ.. జైశ్రీరాం.. జై హనుమాన్ అనే నినాదాలతో మార్మోగాయి.

Loading...