ఆమెతోనే నా పెళ్లి.. 52ఏళ్ల రాహుల్ గాంధీ మనసులో మాట ఇదే..
Updated: Jan 23, 2023, 5:43 PM |
Published: Jan 23, 2023, 4:47 PM
Published: Jan 23, 2023, 4:47 PM

దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకరని కొందరు అంటుంటారు. 52 ఏళ్లు వచ్చినా ఆయన ఇప్పటికీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం భారత్ జోడో పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్‌లో కన్యాకుమారిలో ఆ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర అనేక రాష్ట్రాల గుండా సాగి ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌కు చేరుకుంది. జనవరి 30తో ఈ యాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో తనకు యాత్రలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. ఓ యూట్యూబర్‌తో సరదాగా సంభాషించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. తాను ఎదిగే క్రమంలో నేర్చుకున్న విషయాలు, ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయనే విషయాన్ని చెప్పారు. శారీరకంగా ఎప్పుడూ ఫిట్‌గా ఉండే రాహుల్ గాంధీ.. రోజూ ఎలాంటి కసరత్తులు చేస్తారనే విషయాలు తెలిపారు. తెలంగాణ వంటల విషయంపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక్కడి ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని చెప్పారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ఉన్న సమయంలో ఈ ఇంటర్వ్యూను రికార్డ్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆదివారం పోస్ట్ చేసింది. యాత్రికులు విశ్రాంతి తీసుకునే కంటైనర్ల బయట కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివాహంతో పాటు పలు సరదా ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు రాహుల్ గాంధీ.

1/ 23
rahul gandhi marriage

Loading...