Marriages in May : మూడు ముళ్లకు ముచ్చటైన ముహూర్తాలు
Updated: May 16, 2023, 2:33 PM |
Published: May 16, 2023, 2:33 PM
Published: May 16, 2023, 2:33 PM

Marriages in : వివాహం రెండు జంటల కలయిక. రెండు కుటుంబాల మధ్య అనుబంధానికి వారధి. ఇలాంటి ఆనందకర క్షణాలను మధుర జ్ఞాపకంగా మలచుకోవాలని భావిస్తారు. వీటిన్నింటితోపాటు విభిన్న వృత్తుల వారికి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా ఉపాధి లభించే వేడుక క్రతువు.

1/ 7
Marriages : పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దల మాట. ఇది రెండు జంటల కలయిక. ఓవైపు భాజాభజంత్రీలు.. పూలపందిళ్లు.. కమ్మని విందు భోజనాలతో.. మరోవైపు బంధుమిత్రుల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ కలలు కంటుంటారు. ఈ క్షణాలను మధుర జ్ఞాపకంతో మలచుకోవాలని ఆరాటపడుతుంటారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మే, జూన్ నెలల్లో ఎక్కువగా మంచి ముహూర్తాలుంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మే, జూన్ మధ్య వరుసగా శుభ ఘడియలున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు వివాహాలు చేయడానికి, ఇతర శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, ముందుగానే ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. జూన్ 18 నుంచి ఆగస్టు 18 వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు చేయడానికి వీలులేదు. అందుకే వీలున్న ముహూర్తాల్లోనే శుభకార్యాలు నిర్వహించేందుకు తొందర పడుతున్నారు. ఇదివరకే ఖరారైన వివాహాలకు తగినట్లుగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్నారు. పీక్ మూమెంట్ కావడంతో కల్యాణ మండపాలు ప్రీ బుకింగ్‌తో ఫుల్ అయిపోవడంతో కొందరు దేవాలయాలు, ఇళ్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా ముహూర్తాలు ఉండటంతో వీటిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యాండ్, కేటరింగ్, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, టెంట్‌హౌస్, డెకరేషన్ వ్యాపారులు, పురోహితులు, ఇలా పలు రంగాలకు చెందిన వారు ఈ రెండు నెలలు అస్సలు ఖాళీలేనంతగా పని లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Loading...