Beauty of New Lake Front Park at Hussain Sagar : హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సొబగులు.. లేక్ ఫ్రంట్ పార్క్ అందాలు చూడతరమా
Beauty of New Lake Front Park at Hussain Sagar : హుస్సేన్ సాగర్ సుందరీకరణలో నగర వాసులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఒకవైపు సెక్రటేరియట్ మరోవైపు అమరుల దీపం, అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం వీటికి తోడుగా మరో అద్భుతమైన లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం అయింది. సాగరతీరం- పచ్చటి మొక్కలు ఆకట్టుకునేలా పూలమెుక్కలు, బోర్డ్ వాక్, ప్రత్యేక సదుపాయాలతో నిర్మించారు. త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

1/ 16
Beauty of New Lake Front Park at Hussain Sagar : హుస్సేన్ సాగర్ సుందరీకరణకు తోడుగా మరెన్నో కొత్త నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, మాత్రమే ఉండేది. కానీ టూరిస్టులకు ఎంతో సమయం వెచ్చించేందుకు నూతన కట్టడాలు వెలిశాయి. నూతనంగా మరో పచ్చటి వనాన్ని హెచ్ఎండీఏ సిద్ధం చేసింది. జలవిహార్ పక్కనే ఉన్న 10 ఎకరాల విస్తీర్ణంలో లేక్ ఫ్రంట్ పార్క్ సుందరీకరణ కార్యక్రమం చేపట్టారు. పార్క్‌లోని ప్రధాన భాగాలలో ఎలివేటెడ్ వాక్‌వేలు 4 ఏర్పాటు చేశారు. సాగర్‌లోకి వ్యూ పాయింట్ కోసం కాంటిలివర్ జెట్టీ 15మీటర్లతో కూడిన ప్రతి 110మీ పొడవు, 240 మీటర్ల పొడవు గల కర్విలినియర్ వాక్‌వే, 240 మీటర్లలో అన్ని భాగాలను కలుపుతూ 690 మీటర్ల పొడవు గల 2 మీటర్ల వెడల్పు గల నడక మార్గాలను నిర్మించారు. ఆర్కిటెక్చరల్ అంశాలలో మంటపాలు, ప్రొమెనేడ్ ప్రాంతం, పంచతత్వ నడక మార్గం, సెంట్రల్ పాత్వే, అండర్ పాస్‌లు మొదలైనవి ఉన్నాయి. లేక్ ఫ్రంట్ పార్క్ నిర్మాణ డిజైన్ ప్రకారం 4 లక్షల మొక్కలతో కూడిన అన్యదేశ రకాలైన ల్యాండ్‌స్కేప్ పచ్చదనంతో అభివృద్ధి చేశారు. అలాగే మొక్కల బార్ కోడింగ్ నేమ్ బోర్డులను మొదటిసారిగా హెచ్ఎండీఏ ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ ఉద్యానవనం లోపల 25 ఏళ్ల చెట్లను...రీ ప్లాంటేషన్ చేశారు. 40 రకాల మొక్కల పచ్చదనంలో ఎలాంటి మురుగు నీరు లేకుండా, చెట్ల నీడలో దోమల బెడద లేకుండా ప్రశాంత వాతావరణంలో సేదతీరోచ్చని హెచ్ఎండీఏ అంటోంది. ఇక సువాసన, సుగంధ పరిమరాలు కురిపించే మొక్కలు, అరుదైన వృక్ష జాతులు మొదలైనవి అభివృద్ధి చేశారు. మొత్తం 22 కోట్ల రూపాయలతో లేక్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేశారు.
Loading...
Loading...
Loading...