Actor Surya Emotional tribute to Aishwarya : 'నువ్వు నిజమైన హీరో'.. ఫ్యాన్ మృతి పట్ల సూర్య ఎమోషనల్
Updated: May 20, 2023, 2:08 PM |
Published: May 20, 2023, 2:08 PM
Published: May 20, 2023, 2:08 PM

హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య అనే యువతి మరణం గురించి తెలిసిందే. ఆమె మృతి చెందిన తర్వాత తాను సూర్య అభిమాని అని తెలిసినాక సూర్య చాలా ఎమోషనల్ అయ్యారు.
ఐశ్వర్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐశ్వర్య ఫొటో వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

1/ 6
ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య అనే యువతి మరణించిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అయితే ఐశ్వర్య తమిళ స్టార్ హీరో సూర్యకు వీరాభిమాని అంట. ఈ విషయం తెలుసుకున్న సూర్య చాలా ఎమోషనల్ అయ్యారు.
సూర్య ఐశ్వర్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐశ్వర్య ఫొటో వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలుపుతూ లేఖను రాశారు.
"మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. మాటలు కూడా రావడం లేదు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మీ కుమార్తె ఐశ్వర్య మరణించడం చాలా బాధాకరం. ఆమె ఎల్లప్పుడు మన జ్ఞాపకాల్లో ఉంటుంది. ఒక నక్షత్రంలాగా వెలుగుతూనే ఉంటుంది" అని ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చడానికి ప్రయత్నించారు.
"ఇవి నీ మరణానికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు, నువ్వు నిజమైన హీరోవి" అని సూర్య అన్నారు. 'నీ స్నేహితులకు, నీ కుటుంబసభ్యులకు నువ్వు ఒక ధ్రువతారవు . నీ నవ్వు, నీవు ప్రేమను పంచే తత్వం అందరి హృదయాలను తాకుతుంది' అని సూర్య రాసుకొచ్చారు.

Loading...