క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఊర్వశి రౌతేలా.. ఆ సాంగ్ కోసం రూ. కోట్లలో డిమాండ్!
Updated: May 27, 2023, 11:33 AM |
Published: May 27, 2023, 11:33 AM
Published: May 27, 2023, 11:33 AM

Urvashi Rautela Remuneration : స్పెషల్ సాంగ్స్‌తో టాలీవుడ్లో దూసుకెళ్తున్న అందాల తార ఊర్వశి రౌతేలా. సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో 'వేర్ ఈజ్ బాస్ పార్టీ' అనే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మరో ఛాన్స్ కొట్టేసింది. బోయపాటి-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది. అయితే ఈ సాంగ్ కోసం భారీగానే ఛార్జ్ చేసిందట ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..

1/ 11
Urvashi Rautela Remuneration : తన అందచందాలతో యూత్‌లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. గత కొద్ది కాలంగా బీటౌన్‌కే పరిమితమైన ఈ చిన్నది.. క్రమ క్రమంగా దక్షిణాది వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. హీరోయిన్గా కాకపోయినప్పటికీ స్పెషల్ సాంగ్స్‌లో మెరిసి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతోంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో.. వేర్ ఈజ్ ద పార్టీ అనే ఓ స్పెషల్ సాంగ్ చేసి కుర్ర కారుకు కిర్రకెక్కించింది. ఏజెంట్ సినిమాలోనూ అఖిల్ సరసన స్టెప్పులేసి మరింత పాపులరైంది. అయితే ఈ అమ్మడిపై దృష్టి పెట్టిన టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమా కోసం ఈమెను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తెలుగునాట ఈ ముద్దుగుమ్మను వరస ఆఫర్లు వరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిన్నది మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలా బోయపాటి-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో మెరవనుంది. ఇప్పటి వరకు ఈ అమ్మడు స్టెప్పులేసిన సాంగ్స్ అన్నింటికీ తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఈ సాంగ్ కోసం భారీగానే ఛార్జ్ చేసిందట. ఇంతకీ ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..

Loading...