సూర్యే నంబర్ వన్.. దక్షిణాదిలో టాప్ స్టార్స్ వీళ్లే..
Updated: Jan 22, 2023, 10:12 AM |
Published: Jan 22, 2023, 10:12 AM
Published: Jan 22, 2023, 10:12 AM

విభిన్నమైన కథలు..వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. పలు విషయాల్లో చాలామంది నటుల కంటే చాలా ఉత్తమం అనే మాట తరచూ వినిపిస్తోంది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్బీ) సర్వే కూడా అదే చెబుతోంది. ఈ సంస్థ జరిపిన సర్వేలో దాదాపు అన్ని విభాగాల్లోనూ సూర్యనే అగ్రపథాన నిలిచారు. దక్షిణాదిలో నమ్మదిగిన హీరోలు, ఆకర్షణీయమైన హీరో, ఎక్కువగా అభిమానించే హీరో, మోస్ట్ రెస్పెక్ట్ అండ్ అప్పీలింగ్ హీరో..ఇలా అన్ని విభాగాల్లోనూ టాప్లో సూర్యనే నిలిచారు. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోని 5246 మందితో ఈ సర్వేని నిర్వహించి టియారా(ట్రస్ట్, ఐడెంటిటీ, అట్రాక్టివ్, రెస్పెక్ట్, అప్పీల్) సౌత్ రీసేర్చ్ రిపోర్ట్ 2023ని ఐఐహెచ్బీ విడుదల చేసింది. దక్షిణాదిలో మొత్తం 18మంది హీరోలపై ఈ సర్వే చేయగా అందులో తెలుగు, తమిళం నుంచి చెరో ఆరుగురు, కన్నడ నుంచి ఇద్దరు, మలయాళం నుంచి నలుగురు ఉన్నారు. ఎప్పుడూ దేశవ్యాప్తంగా ఈ సర్వేను చేస్తారు. కానీ తొలిసారి ప్రత్యేకంగా దక్షిణాది నటులపై నిర్వహించారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ టాప్లో నిలిచారు. అయితే అంశాలను బట్టి ఈ స్థానాలు మారాయి. అన్ని అంశాల్లోనూ టాప్లో నిలిచిచారు సూర్య.

1/ 22
ఐఐహెచ్బీ సర్వే 2023

Loading...