Sarath babu Biography : 3 వేల మందిని దాటుకుని హీరోగా.. 250కి పైగా చిత్రాల్లో..
Updated: May 22, 2023, 4:40 PM |
Published: May 22, 2023, 4:11 PM
Published: May 22, 2023, 4:11 PM
Follow Us 

గత కొద్ది రోజులుగా అనారోగ్య సమ్యసలతో చికిత్స పొందుతున్న శరత్‌బాబు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమదాలవలస అందగాడిగా పేరు తెచ్చుకున్న శరత్‌బాబు కెరీర్ ఎలా మొదలైందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

1/ 15
శరత్‌బాబు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమదాలవలస అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి సహజ నటుడిగా ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే పోలీస్ అధికారి కావాలని కలలు కన్న ఆయన.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ యాక్టర్‌గా ఎదిగారు. కాలేజీ చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన ఆయన.. 1973లో విడుదలైన 'రామరాజ్యం'తో హీరోగా తొలి అడుగు వేశారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్య సమ్యసలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. నేడు(మే 22) కన్నుమూశారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు పలువురు సినీప్రముఖులు. ఈ నేపథ్యంలో శరత్‌బాబు కెరీర్ ఎలా మొదలైందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
Loading...
Loading...
Loading...