కీర్తి చేతిలో పింక్ గులాబీలు.. దుబాయ్ బిజినెస్‌మ్యాన్ ఇచ్చినవేనా?.. పెళ్లి ఎప్పుడు మరి?
Updated: May 19, 2023, 9:21 PM |
Published: May 19, 2023, 9:21 PM
Published: May 19, 2023, 9:21 PM
Follow Us 

నాని దసరాతో సూపర్ హిట్ కొట్టేసిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్.. వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా పింక్ కలర్ గులాబీ పువ్వులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. మరోవైపు, ఆ పువ్వులు.. ఆమెకు దుబాయ్ వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్ ఇచ్చినవేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

1/ 12
కీర్తి సురేశ్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేశ్.. ఇటీవలే తెలుగులో దసరా సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ తాజాగా రోజా పూలతో కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. ఈ పూలు కీర్తి సురేశ్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చి ఉంటారనీ.. అందుకే వాటితో పోజులిచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, దుబాయ్ వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో దిగిన ఫొటోను ఇటీవలే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కీర్తి షేర్ చేసింది. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కీర్తి సురేశ్.. త్వరలో పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం 'మమనన్'లో కనిపించనుంది. సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తితో పాటు వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది జూన్ 29న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' చిత్రంలో కూడా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా, చిరంజీవి కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.
Loading...
Loading...
Loading...