దర్శకుడిపై 'ఊసరవెల్లి' బ్యూటీ లైంగిక ఆరోపణలు.. కలిసిన మూడో సారే అలా చేశాడంటూ!
Updated: Mar 19, 2023, 10:06 AM |
Published: Mar 19, 2023, 9:58 AM
Published: Mar 19, 2023, 9:58 AM
Follow Us 

తెలుగు, హిందీ, తమిళం ఏ భాషా అతీతం కాదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. హీరోయన్లను దర్శకులు లైంగికంగా వేధించారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఊసరవెల్లి చిత్రంలో నటించిన బెంగాలీ బ్యూటీ.. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

1/ 21
సినిమా ఇండస్ట్రీనే ఓ వివాదాస్పద ప్రపంచం! ఇండస్ట్రీలో అవకాశాల కోసం తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు హీరోయిన్లు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగే కొద్దీ గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని బహిర్గతం చేస్తూ హీరోయిన్లు సంచలనం రేపుతున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఒకప్పటి తారక్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవరో కాదు. తారక్, తమన్నా నటించిన ఊసరవెల్లిలో మరో సహ నటి బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్. హీరోయిన్గా విజయం సాధించలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. అక్కడా సక్సెస్ కాలేక సీరియల్స్ చేస్తూ స్థిరపడుతోంది. సినిమాల్లో మాత్రం సరైన అవకాశాలు పొందలేకపోయింది పాయల్ ఘోష్. ఇప్పుడు.. ఈమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "దక్షిణాదిన తాను ఇద్దరు జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో పనిచేశాను. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పనిచేయలేదు. ఆయనను మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశారు. సౌత్‌లో జునియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశాను. కానీ ఆయన ఎప్పుడూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదు. ఆయన ఒక జెంటిల్మెన్. ఇప్పుడు చెప్పండి మీరు.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఎందుకు పొగడకూడదు " అంటూ ప్రశ్నించింది. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు ప్రచారం కోసం చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. దక్షిణాదిలో అవకాశాల కోసమే దక్షిణాది సినీ వ్యక్తుల్ని పొగుడుతోందని మండిపడుతున్నారు.
Loading...
Loading...
Loading...