సామ్‌తో విజయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వాటిని నమ్మొద్దంటున్న విశ్వక్

సామ్‌తో విజయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వాటిని నమ్మొద్దంటున్న విశ్వక్
కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత, యశ్, విశ్వక్సేన్ చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..
Vijay Devarkonda Samanhta Birthday celebrations: కశ్మీర్‌లో రౌడీహీరో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. యూనిట్ సభ్యుల సమక్షంలో దేవరకొండ కేక్ కట్ చేశారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంత, నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఈ వేడుకలో పాల్గొన్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ సమంత, దర్శకుడు పూరి జగన్నాథ్, అనన్య పాండే విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోలతో రౌడీ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లైగర్ విడుదల కాకముందే విజయ్, పూరి కలిసి 'జన గణ మన' ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు. దీంతో పాటు ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి లవ్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు.
Yash dubbing movie Santu Straight forward: ఇతర భాషల హీరోల సినిమాలు హిట్ అయితే ఆ కథనాయకులకు సంబంధించిన పాత చిత్రాల డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అవ్వడమే సహజమే. అలా ఈ సారి కేజీఎఫ్ హీరో యశ్.. 'రారాజు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, ఆయన భార్య రాధికా పండిట్ జంటగా నటించిన 'సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్' కన్నడ నాట మంచి హిట్ అయ్యింది. 'కిక్' ఫేమ్ శ్యామ్, సీత, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అవుతుందని దనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Ashokavanamlo Arjuna kalyanam ott release: విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకుడు. ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ ఖండించారు. ''సినిమా ఇంకా విజయవంతంగా థియేటర్లో ప్రదర్శితమవుతుంది. ఓటీటీ విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలోగా కొంత మంది సామాజిక మాధ్యమాల్లో తేదీతో సహా ఓటీటీలో అశోకవనంలో అర్జున కల్యాణం విడుదవుతుందని ప్రచారం చేయడం బాధ కలిగిస్తోంది. థియేటర్లలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల ఉత్సాహాన్ని నీరుగార్చొద్దు..'' అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు విశ్వక్ సేన్. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లంతా వెంటనే డిలీట్ చేయాలని కోరారు.
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న 'ఎఫ్ 3' ఫన్ ట్రైలర్
