'వీరసింహా' జోరు.. బాలయ్య కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్​!

author img

By

Published : Jan 22, 2023, 8:22 PM IST

Updated : Jan 22, 2023, 8:40 PM IST

veera simhareddy movie is the highest grossser in hero balakrishna career

నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ.. బాలయ్య కెరీర్​లో అత్యధిక గ్రాస్​ వసూళ్లు సాధించిన చిత్రంగా 'వీర సింహారెడ్డి' నిలిచిందని మేకర్స్​ తెలిపారు.

'అఖండ' తర్వాత టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా.. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పదిరోజుల్లో రూ.140 కోట్ల గ్రాస్​ వసూలు చేసినట్లు ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి.

అయితే బాలయ్య కెరీర్​లో అత్యధిక గ్రాస్​ వసూళ్లు సాధించిన చిత్రంగా 'వీరసింహారెడ్డి' నిలిచిందని డైరెక్టర్​ గోపీచంద్​ మలినేని ట్వీట్​ చేశారు. బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్​ మలినేని.. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​, మలయాళీ బ్యూటీ హనీరోజ్​ నటించారు. నటసింహం చెల్లెలుగా వరలక్ష్మి శరత్​కుమార్​ నటించి ఆకట్టుకుంది.

veera simhareddy movie is the highest grossser in hero balakrishna career
గోపీచంద్​ మలినేని ట్వీట్

అయితే 2021లో బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' సినిమా ఘనవిజయం సాధించింది. కొవిడ్​ రెండో దశ తర్వాత విడుదలై.. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాగా అఖండ నిలిచింది. 2021 డిసెంబర్​ 2న విడుదలైన అఖండ.. పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. బాలయ్య కెరీర్‌లో తొలిసారి రూ.100కోట్లు సాధించిన చిత్రంగా 'అఖండ' రికార్డు సృష్టించింది.

అంతేకాకుండా 2021 సంవత్సరానికి సంబంధించి ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన చిత్రంగా నిలిచింది. ఓటీటీలోకి వచ్చి 24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోనూ కలిపి రూ.53కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​ జరిగింది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది. మొత్తంగా వంద రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.27కోట్లు షేర్​, రూ.156కోట్లు గ్రాస్​ వసూలు చేసింది.

Last Updated :Jan 22, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.