నటనకు గుడ్​బై చెప్పిన హీరో- హరీశ్​ శంకర్​తో రామ్​ సినిమా?

author img

By

Published : May 15, 2022, 9:06 AM IST

Udaynidhi stalin goodbye to movies

తమిళ యువ హీరో ఉదయనిధి స్టాలిన్ నటనకు గుడ్​బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రామ్​పోతినేని మరో కొత్త సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది.

Udaynidhistalin retirement movies: తమిళ యువ హీరో ఉదయనిధి స్టాలిన్​ తన నటనకు స్వస్తి పలికే విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో 'మామన్నన్'​ అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత నటనకు దూరం కాబోతున్నట్లు తెలిపారు. ఇదే తన చివరి మూవీ అని పేర్కొన్నారు.

" 'మామన్నన్‌' నా ఆఖరి సినిమా. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్‌ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా ఉదయనిధి స్టాలిన్‌ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడని తెలిసిన విషయమే. తండ్రిలానే తాను కూడా రాజకీయాల్లో సెటిల్‌ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే సినిమాలకు దూరం అవుతాడని టాక్‌ వచ్చినా అలా జరగలేదు.

Rampothineni Harish shankar movie: యువ హీరో రామ్​ కెరీర్​లో వరుస ప్రాజెక్ట్​లను ఓకే చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త చిత్రానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్​తో ఆయన మూవీ చేయబోతున్నారట. ఈ మధ్యే వీరిద్దరి కథాచర్చలు కూడా జరిగాయని సమాచారం. త్వరలోనే హరీశ్​ శంకర్​.. పవన్​కల్యాణ్​తో 'భవదీయుడు భగత్​ సింగ్​' సినిమా చేయబోతున్నారు. అది పూర్తవ్వగానే రామ్​తో చేస్తారట. త్వరలోనే ​దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి: ప్రభాస్‌ దృష్టంతా ఆ సినిమాపైనే.. మారుతీ మూవీ మరింత ఆలస్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.