'సలార్‌' షూటింగ్​ షురూ.. తమిళంలో దిశా పటానీ.. వరుణ్​ తేజ్​ యాక్షన్​ థ్రిల్లర్​

author img

By

Published : Sep 24, 2022, 9:14 AM IST

salaar movie shooting resumed

Salaar Shooting Started : తెలుగులో సినిమా చిత్రీకరణ సందడి మొదలైంది. వరుస సినిమాలతో కథానాయకులు బిజీ బిజీగా ఉన్నారు. విరామం తర్వాత సలార్​ చిత్రం షూటింగ్ మొదలైంది. వరుణ్​ తేజ్​ కొత్త సినిమా అప్డేట్​ వచ్చేసింది.

Salaar Shooting Started : కథానాయకుడు ప్రభాస్‌ ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో సెప్టెంబరు 11న కన్నుమూయడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారంతో ఆయన దశదిన కర్మలు పూర్తయ్యాయి. దీంతో తనని నమ్ముకున్న దర్శక నిర్మాతల కోసం తిరిగి సెట్‌లోకి అడుగు పెట్టారు ప్రభాస్‌. 'సలార్‌' చిత్రాన్ని పునఃప్రారంభించారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.

హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజాగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ కోసమే ఇప్పటికే అక్కడ 12 ప్రత్యేక సెట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీటిలోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి సంగీతం: రవి బసూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ్‌.

వరుణ్​ యాక్షన్​ థ్రిల్లర్​..
వరుణ్‌ తేజ్‌ 13వ సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ ద్విభాషా చిత్రం నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి ముందుగానే తన 12వ సినిమాని పట్టాలెక్కించనున్నారు వరుణ్‌. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుంది. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇది అక్టోబరు రెండో వారంలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం.

ఇందుకోసం లండన్‌ వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. దాదాపు నెలకు పైగా సాగే తొలి షెడ్యూల్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలతో పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే వరుణ్‌ 13వ సినిమా మొదలుకానుంది. ఈ రెండు చిత్రాల్ని సమాంతరంగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

'లోఫర్‌' బ్యూటీ తమిళ్ సినిమా..
తెలుగు సినిమా 'లోఫర్‌'తో వెండితెరకు పరిచయమైన నాయిక దిశా పటానీ. ఆ చిత్రం తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఈ తార..వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఎదిగింది. అయితే ఇప్పుడీ భామ మళ్లీ దక్షిణాది చిత్రసీమల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌)లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సుందరి.. ఇప్పుడు 'సూర్య 42'వ చిత్రంతో తమిళ తెరకు పరిచయమయ్యేందుకు సిద్ధమైంది.

శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ - ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. యోగిబాబు, రెడిన్‌ కింగ్సే, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ షెడ్యూల్‌తోనే చిత్ర సెట్లోకి అడుగు పెట్టింది దిశా. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

సెట్లోని చిన్న వీడియో క్లిప్‌ను పంచుకుంటూ.. 'సూర్యతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన'ని చెప్పింది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగనుందని, ఇందులో భాగంగా సూర్య, దిశాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఓ పరాక్రమశాలి గాథగా రూపొందుతోన్న ఈ చిత్రం.. 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిశా పటానీ ప్రస్తుతం హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’లో నటిస్తోంది.

'ఆకాశం' అంత ప్రేమ..
అశోక్‌ సెల్వన్‌ హీరోగా ఆర్‌.ఎ.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆకాశం'. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ శుక్రవారం విడుదల చేశారు. "హేయ్‌ అర్జున్‌.. మనసింత ఉల్లాసంగా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి కదూ" అంటూ రీతూ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది.

ఇందులో అశోక్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముగ్గురు నాయికలతో అతనికి ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ మూడు ప్రేమ కథల్లోనూ బలమైన భావోద్వేగాలు నిండి ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తుంది. మరి ఈ కథలన్నీ సుఖాంతమయ్యాయా? లేదా? తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: లీలావతి కుమార్‌.

ఇవీ చదవండి : మాస్టర్‌ బ్లాస్టర్‌ మెరుపు సిక్స్​.. అభిమానులు ఫిదా

ఇంకా తేలని టికెట్ల లెక్క.. స్టేడియం కుర్చీలపై పిట్టల రెట్ట.. మ్యాచ్ నిర్వహణ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.