అన్​స్టాపబుల్​ పవన్ ప్రోమో రిలీజ్​.. ఆసక్తి పెంచుతున్న బాలయ్య ప్రశ్నలు!

author img

By

Published : Jan 20, 2023, 8:15 PM IST

Updated : Jan 20, 2023, 8:54 PM IST

nbk unstoppable pawan kalyan episode latest promo

పవర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్​ రానే వచ్చింది. ఎన్​బీకే అన్​స్టాపబుల్​ పవన్​ కల్యాణ్​ ప్రోమో రిలీజయ్యింది. దీంతో ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. సీజన్‌2లో భాగంగా ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇటీవల ఈ షోకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో ఆహా కొత్త టీజర్‌ను విడుదల చేసింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు. వాటితోపాటు పవన్​ను బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. 'మీ అన్నయ్య చిరంజీవి నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నది ఏంటి?' అంటూ పవన్​ను బాలకృష్ణ అడిగారు. ఆ సమయంలో పవన్ సీరియస్​గా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 'రాష్ట్రంలో నీకు అభిమాని కానీ వారెవ్వరూ లేరు అయినా కూడా ఆ అభిమానం ఓట్ల రూపంలో మారలేదు ఎందుకు?' అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కూడా పవన్ ఆసక్తికరంగా సమాధానం చెప్పినట్లు ప్రోమోలో చూడవచ్చు.

మొత్తానికి అన్​స్టాపబుల్‌ పవన్‌ ఎపిసోడ్​పై ఈ ప్రోమో ఆసక్తి పెంచుతోంది. అయితే ఈ ఎపిసోడ్​ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సీజన్ 2 చివరి ఎపిసోడ్​గా పవన్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jan 20, 2023, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.