ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు.. కాక్టైల్ పార్టీ కేక్ వెనుక పెద్ద స్టోరీ!
Published: Nov 21, 2022, 12:19 PM


ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు.. కాక్టైల్ పార్టీ కేక్ వెనుక పెద్ద స్టోరీ!
Published: Nov 21, 2022, 12:19 PM
హీరో నాగశౌర్య- అనూష శెట్టి వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్లో వీరిద్దరూ ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు, కాక్టైల్ పార్టీ రోజు కట్ చేసిన కేక్ వెనుక చాలా పెద్ద కథ ఉన్నట్లు బేకరీ యజమాని వెల్లడించారు.
Nagashaurya Wedding: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
-
@IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE
— devipriya (@sairaaj44) November 20, 2022
ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది.
-
#LetsGoShaan #NagaShaurya #AnushaShetty @IamNagashaurya pic.twitter.com/eQn2hNw4oW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022
నాగ శౌర్య-అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ వెనుక ఇంత కథ ఉందా?
అయితే నవంబర్ 19న బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మెహందీ, కాక్ టెయిల్ నైట్‌ను నిర్వహించారు నాగశౌర్య ఫ్యామిలీ. ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పార్టీకి హాజరైన వారంతా ఆటా పాటలతో ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. మూడు స్టెప్స్ కలిగిన ఈ కేక్ పార్టీకి హాజరైన వారిని ఎంతో ఆకట్టుకుంది.
తాజాగా ఈ కేకు తయారీ కోసం తాము పడ్డ శ్రమ గురించి బేకర్ శుభ కుశలప్ప వెల్లడించారు. కాక్ టెయిల్ పార్టీకి కేవలం ఒక రోజు ముందే కేక్ కు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఫ్యాన్సీ కేక్‌ను తయారు చేయడం సాధ్యం కాదన్నారు. అయితే, అనూషతో తమకు ఉన్న సత్సంబంధాల కారణంగా కాదనలేకపోయినట్లు ఆమె వెల్లడించారు.
