'వీర సింహారెడ్డి' దర్శకుడికి చిరంజీవి స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే?

author img

By

Published : Jan 21, 2023, 9:59 AM IST

Megastar Chiranjeevi special gift to Gopichand Malineni

వీర సింహారెడ్డితో సూపర్ సక్సెస్​ను అందుకున్న దర్శకుడు గోపిచంద్​ మలినేనికి మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట. ఆ సంగతులు..

ఈ సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' సినిమాలు సూపర్​ హిట్​గా నిలిచాయి. విడుదలై పది రోజులు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు కొనసాగిస్తూ మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే వంద కోట్లకుపైగా కలెక్ట్ చేశాయి. అయితే ఈ క్రమంలోనే సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న వీరసింహా డైరెక్టర్​ గోపిచంద్​ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ చిరంజీవి తనకు ఓ స్పెషల్​ గిఫ్ట్‌ ఇచ్చారంటూ గుర్తుచేసుకున్నారు.

"నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్​ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్​లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్​ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్​ తెప్పించి గిఫ్ట్​గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్​ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్​ రెమ్యునరేషన్​ ఇవ్వలేదు. వీర సింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు." అని గోపి చంద్​ చెప్పుకొచ్చారు.

​కాగా, రవితేజ డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్ మలినేని. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్‌ ఇలా వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక​ తాజాగా బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమా చేసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్​ను అందుకున్నారు.

ఇదీ చూడండి: "ఇదే నా చివరి సినిమా..ఇక నా వల్ల కాదు!".. "ఈ పాలిటిక్స్ నా దగ్గర వద్దు!"

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.