'జక్కన్న ఈ ఖాళీ కుర్చీ ఎప్పటికీ మీదే'.. రాజమౌళికి సుకుమార్ స్పెషల్ విషెస్

author img

By

Published : Jan 25, 2023, 10:52 PM IST

Director Sukumar Different Wishes To Rajamouli On Oscar

రాజమౌళి.. ఈ సీట్​ మీ కోసమే అంటూ సుకుమార్‌ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరలవుతోంది. అస్సలు ఆయన దేన్ని ఉద్దేశించి ఈ మాట అన్నారో.. ఆ కుర్చీ కహానీ ఏంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

కేవలం తన సినిమాలతోనే కాకుండా స్టేజీలపై ఇచ్చే స్పీచ్​లతోనూ అలాగే సోషల్​ మీడీయాలో పెట్టే పోస్ట్‌లతోనూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. డైరెక్టర్​ రాజమౌళికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపి, నెటిజన్లను మరోసారి తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' లోని 'నాటు నాటు' సాంగ్​ ప్రతిష్టాత్మక ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళికి డిఫరెంట్​గా విషెస్ చెప్పారు సుకుమార్‌. ఓ మీటింగ్‌ రూమ్‌లో తన టీమ్​తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ గురించి వివరించారు.

'ఇన్నాళ్లూ నా బృందంతో జరిపిన చర్చలు, సమావేశాల్లో అసంకల్పితంగా ప్రిన్సిపల్‌ కుర్చీని ఖాళీగా వదిలేశా. నేనెందుకు అలా చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజమౌళి సర్‌ ఇది మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పటికీ మీదే' అంటూ సుకుమార్‌.. రాజమౌళిపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం, ఆ పాటను రాసిన చంద్రబోస్‌, స్వరాలు సమకూర్చిన ఎం. ఎం. కీరవాణి, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ సహా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కంగ్రాట్స్‌ చెప్పారు. 'మీ అభినందన అదిరింది', 'మంచి ఎలివేషన్‌ ఇచ్చారు' అంటూ నెటిజన్లు సుకుమార్‌ పోస్ట్‌ను లైక్‌ చేస్తున్నారు. సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.