'అఖండ' నటుడు చలపతి చౌదరి కన్నుమూత

author img

By

Published : May 20, 2022, 10:06 AM IST

Updated : May 20, 2022, 2:53 PM IST

chalapati

సినీ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. తీవ్ర ఆస్వస్థతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు కెప్టెన్​ చలపతి చౌదరి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ.. రాయచూర్​లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పలు దక్షిణాది సినిమాల్లో చలపతి చౌదరి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలై సూపర్​హిట్​గా నిలిచిన బాలకృష్ణ సినిమా 'అఖండ'లో కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడలో మొత్తం 100 సినిమాల్లో నటించారు చలపతి. అలాగే పలు సీరియల్స్​లో ఆయన వివిధ పాత్రలు చేశారు. చలపతి చౌదరి.. విజయవాడకు చెందిన వారు కాగా.. రాయ్​చూర్​లో స్థిరపడ్డారు.

ఇదీ చదవండి: NTR Birthday: ఎన్టీఆర్​తో మామూలుగా ఉండదు.. ఏదైనా రాయల్​గానే..

Last Updated :May 20, 2022, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.