Thief in Bjp meeting: భాజపా సభలో దొంగ చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు

author img

By

Published : Sep 21, 2021, 8:43 PM IST

Thief in Bjp meeting

రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ మధ్య దొంగలు (Thief at Bjp meeting) రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ బిజీగా ఉన్న సమావేశంలో తమ పనిని సైలెంట్​గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డిలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటాన్ని(Thief at Bjp meeting) ప్రదర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. భాజపా మీటింగ్ జరుగుతున్న సమయంలో దొంగలు తమ పనితనం ప్రదర్శించారు. దొంగలు ఒకరి వద్ద నుంచి పర్సుని దొంగిలించారు.

ఇంకొకరి వద్ద నుంచి సెల్​ఫోన్ దొంగతనం చేస్తుండగా వారిని గమనించిన స్థానికులు పట్టుకొని చోరుడిని చితకబాది స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. కామారెడ్డి సీఐ మధుసూదన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల యాదాద్రి జిల్లాలో ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. ఏకంగా రాజకీయ నాయకుల పర్సును కొట్టేసిన ఘటనలు ఉన్నాయి.

భాజపా సభలో దొంగ చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు

ఇదీ చూడండి: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.