Fire accident at urumadla: మంటల్లో దగ్ధమైన సుబాబుల్ చెట్లు.. భారీగా ఆస్తినష్టం

author img

By

Published : May 29, 2022, 4:29 PM IST

Fire accident at urumadla

Fire accident at urumadla: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్దఎత్తున సుబాబుల్ చెట్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది.

Fire accident at urumadla: సుబాబుల్ చెట్ల తోటలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. సుమారు పది ఎకరాల్లో చెట్లు మొత్తం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున పొగలు రావడంతో పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ మంటలు పక్కనే పొలాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మంటల్లో దగ్ధమైన సుబాబుల్ చెట్లు.. భారీగా ఆస్తినష్టం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.