కళాశాల యాజమాన్యం చేసిన పనికి విద్యార్థి బలి.. అసలేం జరిగింది?

author img

By

Published : Aug 30, 2022, 5:29 PM IST

student suicide

Student Suicide in Mancherial రాష్ట్రంలోని ప్రైవేట్​ కళాశాలల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీరి నిలువు దోపిడీల వల్ల బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల పాలిట యమపాశాలులాగా వెలిశాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కళాశాలలే ఆరాచకాలకు పాల్పడుతున్నాయి. విద్య అన్నది ఎటువంటి లాభాపేక్షలేని వనరు అటువంటి విద్యను నేడు వ్యాపారంగా చేసి విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. అటువంటి మంచిర్యాలలో జరిగింది..

Student Suicide in Mancherial: కళాశాల యాజమాన్యం విద్యార్హత సర్టిఫికెట్లు ఇవ్వలేదని మనస్తాపంతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగిన విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్, హైదరాబాద్ ఆదిభట్ల ప్రాంతంలోని శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

ఇంటర్మీడియట్​ పరీక్షలు అయిపోవడంతో ఇంజినీరింగ్​ చదవడానికి ఎంసెట్​ పరీక్ష రాశాడు. ఆ ఎగ్జామ్​లో ఉత్తీర్ణత సాధించి, కళాశాలో ప్రవేశం పొందడానికి మెుదటగా కౌన్సెలింగ్​ నిర్వహిస్తారు. ఇందు​లో సర్టిఫికెట్ వెరిఫికేషన్​ ఉంటుంది. సర్టిఫికెట్ల కోసం కళాశాల యాజమాన్యాన్ని అంజిత్​ తండ్రి సంప్రదించగా 40,000 బకాయిలు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలని మృతుని బంధువు తెలిపాడు. తన తండ్రి 30వేలు రూపాయలను కడతానని బతిమిలాడినా, కళాశాల యాజమాన్యం కనికరం లేకుండా వ్యవహరించిందని అతను పేర్కొన్నాడు.

కౌన్సెలింగ్​ సమయానికి ఇంటర్ సర్టిఫికెట్లు అందకపోవడంతో దిక్కుతోచని అంజిత్ ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. వెంటనే విద్యార్థిని దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతితో కుంటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, కలమడుగు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రమైన జన్నారంలోని ప్రధాన రహదారిపై విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, కళాశాల యజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రాస్తారోకో చేశారు. కార్పొరేట్ కళాశాలలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉసురుతీస్తున్నాయని ప్రభుత్వం కళాశాలల ఫీజులపై నియంత్రణ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.