బైరి నరేశ్​పై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం: ఎస్పీ కోటిరెడ్డి​

author img

By

Published : Dec 31, 2022, 7:54 PM IST

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే శిక్ష తప్పదు

SP reaction on Naresh case of religious hatred: ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న బైరి నరేష్​ కేసుపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ఎవ్వరినైనా చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

SP Reaction on Bairi Naresh Case : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా శిక్షిస్తామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడిన బైరి నరేశ్​పై పీడీ చట్టం నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బైరి నరేశ్​​​పై గతంలోనూ కేసులున్నట్లు తెలిసిందని, దానికి సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

"మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే శిక్షిస్తాం. అదే విధంగా ఈరోజు ఉదయం నరేశ్​​ను అరెస్టు చేశాం. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టు ముందు హాజరుపరచి నరేశ్​కు శిక్ష పడేలా చేస్తాం."-కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే శిక్ష తప్పదు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.