MURDER CASE: 'హత్య కోసం సుపారీ తీసుకుని హత్యకు గురయ్యాడు'

author img

By

Published : Sep 16, 2021, 5:21 PM IST

Updated : Sep 16, 2021, 5:43 PM IST

MURDER CASE: 'హత్య కోసం సుపారీ తీసుకుని హత్యకు గురయ్యాడు'

ఒకరిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నాడు, కానీ వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అలంఖాన్​గూడలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు.

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని అలంఖాన్​గూడ శుభగృహ వెంచర్ ముందు ఈ నెల 11న దారుణ హత్యకు గురైన బోడ వెంకటయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు.

చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి గ్రామానికి చెందిన అశోక్, అతని చెల్లెలు అమృతల మధ్య కొంత కాలంగా రెండుఎకరాల పొలంపై భూవివాదం నడుస్తోంది. ఈ భూమి విషయమై ఎంతో కొంత డబ్బులు ఇస్తానని కేసు వేయొద్దని అశోక్​ అమృతకు చెప్పగా.. దీనికి ఆమె ఒప్పుకోకుండా భూమిపై కేసు వేసింది.

దీనితో పగ పెంచుకున్న అశోక్.. అమృతను చంపాలని వరసకు బావ అయిన బోడ వెంకటయ్యతో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.4లక్షలు తీసుకుని పని చేయకపోగా.. ఇంకో 50వేలు ఇవ్వమని బెదిరింపులకు దిగాడు. దీనితో ఈ హత్య ఒప్పందం బయటికి చెబుతాడేమోనని అశోక్ భయపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

అశోక్ దగ్గరికి పని కోసం వచ్చిన అతని వదిన కుమారుడు పవన్​కు ఈ గొడవ గురించి తెలియగానే వెంకటయ్యను చంపుతానని.. తనకు రూ.10వేలు ఇవ్వాలని అశోక్​తో అన్నాడు. సరే అని చెప్పిన అశోక్.. ఈ నెల 11వ తేది అర్ధరాత్రి రెండు గంటలకు మాట్లాడుకుందామని వెంకటయ్యకు ఫోన్ చేసి రమ్మన్నాడు. శుభగృహ వెంచర్ వద్దకు రాగానే అశోక్, బోడ వెంకటయ్య ఇద్దరు గొడవ పడుతుండగా వెనుక నుంచి వచ్చిన పవన్ వెంకటయ్య కళ్లలో కారం చల్లాడు. తర్వాత ఇద్దరూ కలిసి వెంకటయ్యను దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అనంతరం తమ కారులో కంది వైపు పారిపోతూ.. రక్తపు మరకలు ఉన్న తమ దుస్తులను మార్గమధ్యలో దోభీపేట్​ గ్రామ సమీపంలో చెట్ల పొదల్లో విసిరేసి పారిపోయారు.

మృతుడి భార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు శంకర్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ మహేష్ గౌడ్, ఎస్సైలు సంజీవ్, లక్ష్మీనారాయణతో పాటు శంషాబాద్ జోన్ పోలీసులు ఈ హత్య కేసును చాకచక్యంగా ఛేదించారు. నిందితులు అశోక్, పవన్​లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శంకర్​పల్లి పోలీసులు, శంషాబాద్ పోలీసు సిబ్బందిని చేవెళ్ల ఏసీపీ రవీందర్​ రెడ్డి అభినందించారు.

బోడ వెంకటయ్య, అశోక్​ కలిసి మాట్లాడుకున్నారు. మీ చెల్లె ముచ్చట ఏమైందని వెంకటయ్య అడగగా.. అవును మా చెల్లె కేసు వేస్తానని ఇబ్బంది పెడుతోంది... ఎట్లయిన ఆమెను చంపేయాలని అశోక్​ అన్నాడు. నేను చేస్తా..కానీ 5లక్షలు కావాలని వెంకటయ్య అడగగా.. లక్ష రూపాయలు అశోక్​ అడ్వాన్స్​ ఇచ్చాడు. మూణ్నెళ్ల క్రితం ఇది జరిగింది. ఈ మూణ్నెళ్ల సమయంలో మధ్యమధ్యలో మొత్తం 4లక్షలు తీసుకున్నాడు. వీడు డబ్బులు తీసుకుని పనిచేయడం లేదని అశోక్​, అతని సడ్డకుని కొడుకు పవన్​ అతనిని చంపేయాలని అనుకున్నారు. వీరిద్దరు ప్లాన్​ ప్రకారం వెంకటయ్యను అక్కడికి పిలిపించి హత్య చేయడం జరిగింది. -రవీందర్​ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ

MURDER CASE: 'హత్య కోసం సుపారీ తీసుకుని హత్యకు గురయ్యాడు'

సంబంధిత కథనం:

murder: అర్ధరాత్రి ఫోన్ చేశారు.. అతికిరాకంగా తల, చేతులు నరికేసి చంపేశారు!

Last Updated :Sep 16, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.