Old couples harassment: కోడలి వేధింపుల నుంచి రక్షించండి.. ఆర్డీవోకు వృద్ధదంపతుల వినతిపత్రం

author img

By

Published : Sep 24, 2021, 6:36 PM IST

Old couples harassment

చిన్నప్పుడు మనల్ని తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుతారు. అలాంటి వారికి చివరి మజిలీలో మనం కూడా బాగోగులు చూసుకోవాలి కదా. కానీ కొందరు మాత్రం మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆస్తి కోసం వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. కొడుకు, కోడలు పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ వృద్ధ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

వయసు తగ్గిన వృద్ధ దంపతుల ఆవేదన ఇది. వృద్ధాప్యంలో వారు పడే బాధలకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ సంఘటన. కన్న కొడుకులు వారిని పట్టించుకోకుండా గాలికొదిలేశారు. వారి ఆలన పాలన చూడాల్సింది పోయి వేధింపులకు గురి చేస్తున్నారు. చివరికి వారు పెట్టే చిత్రహింసలు భరించలేని ఆ వృద్ధ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

జగిత్యాలకు చెందిన మేరుగు రాజన్న ఆయన భార్య భూలక్ష్మితో కలిసి ఆర్డీవోను కలిశారు. కొడుకు, కోడలు తమను ఆస్తికోసం వేధిస్తున్నారంటూ వాపోయారు. తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తమ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆర్డీవో దుర్గా మాధురికి వినతి పత్రం అందజేశారు. తాము తలదాచుకుంటున్న ఇంటిని రాసివ్వాలని నిత్యం బెదిరిస్తున్నారని వృద్ధ దంపతులు ఆర్డీవోకు తమ గోడును వినిపించారు. దీనిపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు.

మాకు ప్రాణగండం ఉంది. ఆస్తి ఇస్తావా లేదా అని బెదిరిస్తున్నారు. వాళ్ల ఇద్దరు కొడుకుల మీద, ఆమె మీద చర్యలు తీసుకోవాలే. నన్ను, నా బిడ్డలను ఇష్టమొచ్చినట్లు తిడుతోంది. నాకున్న ఒక్క ఇంటిని రాసివ్వాలని బెదిరిస్తోంది.-భూలక్ష్మి, బాధితురాలు

వయోవృద్ధులను పోషించాల్సింది పోయి వారిని వేధింపులకు గురి చేస్తున్నరు. మిమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారు. వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. వారి కోడలికి కౌన్సిలింగ్ ఇస్తే మాపై కూడా దుర్భాషలాడారు. విధిలేక ఇవాళ ఆర్డీవోను సంప్రదించాం. సానుకూలంగా స్పందించిన ఆర్డీవో గారు పోలీసులకు సమాచారమిచ్చారు. - హరి అశోక్‌కుమార్‌, వయో వృద్ధుల సంఘం నాయకుడు

వృద్ధ దంపతులకు కోడలి వేధింపులు

ఇదీ చూడండి: రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి.. కల సాకారమయ్యే వేళ ప్రాణం కోల్పోయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.