సికింద్రాబాద్​లో భారీ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రికల్ గోదాంలో చెలరేగిన మంటలు

author img

By

Published : Jan 12, 2022, 8:44 AM IST

Updated : Jan 12, 2022, 10:13 AM IST

Fire Accident

08:41 January 12

Fire Accident: 5 అగ్నిమాపక వాహనాలతో మంటలార్పిన సిబ్బంది

సికింద్రాబాద్​లో భారీ అగ్నిప్రమాదం

Secunderabad Fire Accident: సికింద్రాబాద్​లోని రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్​ గోదాంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో.. షార్ట్​ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. దట్టంగా పొగ వ్యాపించడంతో.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక వాహనాలతో సుమారు మూడు గంటల నుంచి శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి మొదటి అంతస్తులో వస్తు సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Last Updated :Jan 12, 2022, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.