పిల్లల ముందే భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త, ఎక్కడ జరిగిందంటే

author img

By

Published : Aug 21, 2022, 8:37 AM IST

wife murder

Husband murdered wife అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు రేపింది. అది కాస్తా అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. పిల్లల ముందే కట్టుకున్న భార్య గొంతు కోసి హత్య చేసేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్​లోని ఉప్పల్‌లో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Husband murdered wife: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పిల్లల ముందే భార్య గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉప్పల్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది చంద్రయ్య కూతురు దివ్యభారతి(33) వివాహం 12 ఏళ్ల క్రితం అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పుస్తకాల దీపక్‌(40)తో జరిగింది. భారీగానే కట్నకానుకలు ఇచ్చినా అదనపు కట్నం, అనుమానంతో ఆమెను దీపక్‌ వేధిస్తూనే ఉన్నాడు. మూడు నెలల క్రితం దివ్యభారతిని వేధించడంతో తండ్రితో కలిసి ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి వేధించనని ఒప్పుకొన్నాడు.

ప్రణాళిక ప్రకారమే.. దీపక్‌, దివ్యభారతికి ఇద్దరు సంతానం. బాబు ఐదు, పాప మూడో తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఉప్పల్‌లోని కురుమనగర్‌లో ఉంటున్నారు. దీపక్‌ రియల్‌ ఎస్టేట్‌ చేస్తుండగా, ఆమె ఓ కార్పొరేట్‌ పాఠశాలలో పని చేస్తోంది. అతడు 10 రోజులుగా ఇంటికి రావడం లేదు. శుక్రవారం రాత్రి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక నిద్రలో ఉన్న భార్యపై దాడి చేశాడు. పెద్దగా అరవడంతో పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు కూడా నిద్ర లేచారు. ఈలోపే కత్తితో దివ్యభారతి మెడకోసి హత్య చేశాడు. రాత్రి ఇంటి చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో పడి ఉన్న దివ్యభారతి అప్పటికే మృతి చెంది ఉంది. పారిపోయేందుకు ప్రయత్నించిన దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన కూతుర్ని అల్లుడు, అతడి కుటుంబసభ్యుల ప్రోద్బలంతోనే హత్య చేశాడని చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి భార్యను కూడా ఆడపిల్ల పుట్టిందని వదిలేసి తమ కూతురుని చేసుకున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.