SUISIDE : 'ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న.. అమ్మ'

author img

By

Published : Aug 24, 2021, 6:49 AM IST

Updated : Aug 24, 2021, 12:42 PM IST

m tech student commits suicide in hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన మౌనిక హెచ్​సీయూలో ఎంటెక్‌- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం కిటికీ చువ్వకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న.. అమ్మ అని సూసైడ్‌ నోట్‌ రాసి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్‌.మౌనిక(27) హెచ్‌సీయూలో ఎంటెక్‌- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లోని మహిళా వసతి గృహం-7లో ఉంటోంది.

సోమవారం ఉదయం నుంచి గదిలోంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పిలిచినా స్పందన లేదు. వెంటిలేటర్‌లోంచి చూడగా కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎంటెక్‌ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించడంతో ఈనెల 18వ తేదీన హాస్టల్‌ గదికి వచ్చి ఉంటోంది.

m tech student commits suicide in hcu
హెచ్‌సీయూలో ఎంటెక్‌ విద్యార్థిని ఆర్‌.మౌనిక ఆత్మహత్య

ఆమె తండ్రి లచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చదువుతోంది.

ఇదీ చదవండి : కోర్టు ధిక్కరణపై సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం

Last Updated :Aug 24, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.