Ganja seized: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. ఎన్ని కిలోలంటే?
Updated on: May 10, 2022, 12:12 AM IST

Ganja seized: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. ఎన్ని కిలోలంటే?
Updated on: May 10, 2022, 12:12 AM IST
Ganja seized: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 110కిలో గంజాయి పట్టుబడింది. పుష్ప సినిమాను తలదన్నే విధంగా గంజాయి స్మగ్లింగ్ పాల్పడ్డుతున్న ఇద్దరు సభ్యుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. పుష్ప సినిమాలో ఎర్ర చందన అక్రమ రవణాను తలదన్నే రీతిలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన ఇద్దరు సభ్యుల ముఠా గుట్టురట్టైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 100కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా చోడవరం నుంచి భద్రాచలం వైపు వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆపి పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ వ్యవహారం బయట పడిందని జానయ్య తెలిపారు. టాటా ఏస్ కింది భాగంలో కృత్రిమ సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా డిజైన్ చేశారన్నారు.
మరో కేసులో కేరళకు చెందిన ముగ్గురు యువకులని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కిలోల స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రెండు కేసుల్లో కలిపి 110 కిలోల గంజాయిని పట్టుకున్నామని జానయ్య తెలియజేశారు.
ఇదీ చదవండి: Accident CCTV Footage: డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం
ఇల్లు కూల్చేస్తారని ఆవేదన.. ఒంటికి నిప్పంటించుకొని వృద్ధుడు ఆత్మహత్య
