ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిప్పు.. ఆకతాయిల పనేనా

author img

By

Published : Jan 23, 2023, 12:30 PM IST

Jagtial district

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కళాశాలలో నిన్న రాత్రి రెండు గదులకు ఆకతాయిలు నిప్పటించారు. దీంతో విద్యా, వైజ్ఞానిక సదస్సు కోసం విద్యార్థులు తయారుచేసిన పలు పరికరాలు, కళాశాల సామగ్రి దగ్ధమయ్యాయి.

ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు విద్యా వైజ్ఞానిక సదస్సు కోసం వివిధ రకాల పరికరాలు, నమునాలు తయారు చేసుకున్నారు. ఈ రోజు భారీ ఎత్తున్న ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది. కొందరు ఆకతాయిలు నిన్న రాత్రి వారు భద్రపరచుకున్న నమునాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన సామగ్రి దగ్ధమైంది. దీంతో విద్యార్థులు ఎంతో కష్టపడి తయారు చేసిన వివిధ వస్తువులు.. అగ్నికి ఆహుతవ్వడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిదంటే: జగిత్యాల జిల్లాలో మెట్​పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా, వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలని అనుకున్నారు. ఇందుకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు, పరికరాలు రూపొందించారు. గత ఇరవై రోజుల నుంచి ఈ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. వివిధ రకాల నమునాలను రెండు గదులలో భద్రపరిచారు. ఈ క్రమంలోనే ఈరోజు భారీ ఎత్తున విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది

కొందరు ఆకతాయిలు ఆ గదులకు నిప్పు పెట్టారు. దీంతో వారు తయారుచేసిన వైజ్ఞానిక పరికరాలతో పాటు కళాశాలకు చెందిన కొంత ఫర్నిచర్ కూడా అగ్నికి అహుతయ్యింది. ఈ ఘటనపై ఉన్నత అధికారులకు సమాచారం అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్​ వెంకటేశ్వర్​రావు తెలిపారు. ఎంతో ప్రయాస కూర్చి చేసిన నమునాలు ఈ విధంగా కావడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వినూత్నంగా విద్యా, వైజ్ఞానిక సదస్సును నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పదో తరగతి విద్యార్థులు నమోద జరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అందులో భాగంగా విద్యార్థులు వివిధ రకాల నమూనాలు రూపొందించారు. ఎవరో ఆకతాయిలు వాటికి నిప్పుపెట్టారు. తద్వారా అవి పూర్తిగా కాలిపోయాయి. ఈవిషయాన్ని పై అధికారులకు తెలియచేయడం జరిగింది." - వెంకటేశ్వర్​రావు, జగిత్యాల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్

ఇవీ చదవండి: రాజధానిలో దారుణం.. వ్యక్తిని వేటాడి, వెంటాడి నరికి చంపిన దుండగులు

బిహార్​లో మరోసారి కల్తీ మద్యం కలకలం.. ముగ్గురు మృతి.. పలువురికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.