నానక్‌రాంగూడలోని బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

author img

By

Published : May 28, 2022, 12:16 PM IST

Updated : May 28, 2022, 1:48 PM IST

fire accident at nanakramguda bawarch

12:14 May 28

నానక్‌రాంగూడలోని బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

నానక్‌రాంగూడలోని గ్రీన్‌బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

fire accident at bawarchi hotel : హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్ గార్డింగ్ ప్రైవేట్ లిమిటెండ్ సిబ్బందికి పైన కేటాయించిన కార్యాలయంలోనూ మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భవనంలో ఉన్న వారికి ఊపిరాడక భవనం టెర్రస్‌ పైకి పరుగులు తీశారు. వారిని క్రేన్‌ సహాయంతో పోలీసులు కిందకు దించారు. ఊపిరాడక ఇబ్బంది పడిన వారికి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. నాలుగు యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేశిస్తున్నామని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 14 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నారని హోటల్ యాజమాన్యం తెలిపింది. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బంది పడ్డ సిబ్బందికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. హోటల్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పొగ వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Last Updated :May 28, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.