Choreographer arrest డ్రగ్స్​ విక్రయిస్తూ దొరికిపోయిన కొరియోగ్రాఫర్

author img

By

Published : Aug 28, 2022, 8:23 AM IST

drugs

Choreographer arrest హైదరాబాద్​ నగరంలో నిషేధిత డ్రగ్స్​ మాత్రలతో అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ పట్టుబడ్డాడు. ఈ ఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. నిందితునిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Choreographer arrest: మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా డ్రగ్స్‌ వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని మియాపూర్ పోలీస్​స్టేషన్ పరిధి గోకుల్ ప్లాట్స్​లో చోటుచేసుకుంది.

దొమ్మరాజు గోపికృష్ణ అనే వ్యక్తి నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్​ను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. గోపికృష్ణ వద్ద నుంచి 55 వేల రూపాయల విలువచేసే పది నిషేధిత డ్రగ్స్ మాత్రలు, ఓ సెల్​ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​డీపీఎస్​ యాక్ట్ కింద ఎస్​వోటీ పోలీసులు కేసు‌ నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.