CYBER CRIME: బిట్​ కాయిన్​ ట్రేడింగ్​ అంటూ.. రూ.60లక్షలు దోచుకున్నారు.!

author img

By

Published : Sep 24, 2021, 1:14 PM IST

bit coin trading

బిట్ కాయిన్(Bit Coin Trading) ట్రేడింగ్ పేరుతో నగరవాసులను సైబర్ మోసగాళ్లు(Cyber Cheaters) టార్గెట్​ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే ముగ్గురు వ్యక్తులను టార్గెట్ చేసి రూ.60లక్షలకు పైగా కాజేసిట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. విడతలవారీగా పెట్టుబడి పెట్టించి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయిస్తున్నారు.

సైబర్ మోసగాళ్లు(Cyber Cheaters) హైదరాబాద్​ నగరవాసులను రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బిట్ కాయిన్ ట్రేడింగ్(Bit Coin Trading) పేరుతో టార్గెట్ చేస్తున్నారు. మూడు రోజుల్లో ముగ్గురికి ఎరవేసి రూ.60 లక్షలకు పైగా కాజేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తాజాగా హైదరాబాద్(Hyderabad)​లోని హబ్సిగూడకు చెందిన ఓ వ్యక్తిని ట్రాప్ చేసి కాయిన్ యు ఎఫ్ యాప్​(Coin u f App)ను సైబర్ నేరగాళ్లు(Cyber Cheaters) డౌన్​లోడ్​ చేయించారు. విడతల వారీగా రూ.12 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించిన తర్వాత సైబర్ నేరగాళ్లు యాప్​ను డిలీట్ చేసినట్లు బాధితుడు హైదరాబాద్​లోని సైబర్ క్రైమ్​(Cyber Crime Police) పోలీసులను ఆశ్రయించాడు.

వాట్సప్​ గ్రూప్​ ద్వారా

మూడు రోజుల క్రితం ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. బిట్ కాయిన్- ఎం8(Bit Coin M8) పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు సైబర్​ నేరగాళ్లు. నగరంలోని చంద్రయాణగుట్టకి చెందిన ఓ వ్యక్తి ఫోన్ నంబర్​ను అందులో యాడ్​ చేశారు. బిట్ కాయిన్ వ్యాపారంపై శిక్షణ ఇస్తున్నట్లు ఆ వ్యక్తిని మభ్యపెట్టారు. విడతల వారీగా అతడి నుంచి రూ.14 లక్షలకు పైగా కాజేసి... ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ డిలీట్ చేశారు. మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్​ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. మరో ఘటనలో ఓ యువకుడిని సైతం బిట్​ కాయిన్​ ట్రేడింగ్​ పేరుతో మోసం చేశారు.

మూడు రోజుల్లో ముగ్గురి నుంచి రూ.60లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో సైబర్ క్రైం పోలీసులు బిట్ కాయిన్ ట్రేడింగ్​పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నేరగాళ్లు ఎక్కడి నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నారు.? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు.? వీరికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారా.? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయి.. కల సాకారమయ్యే వేళ ప్రాణం కోల్పోయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.