ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
Young Couple Committed Suicide: జగత్గిరిగుట్టలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌కు బతుకు తెరువు కోసం వచ్చిన వడ్ల బ్రహ్మచారి(28) జగత్గిరిగుట్ట పరిధిలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటూ.. వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. అతనికి మూడు సంవత్సరాల క్రితం మౌనిక(20)తో వివాహం జరిగింది. కాగా వారికి ఇంత వరకు పిల్లలు కలగలేదు. గత రెండు నెలలుగా పని లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Couple Suicide in Jagadgiri Gutta: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదేళ్ల క్రితం కర్నూల్ జిల్లా మారందొడ్డి నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసొచ్చిన వడ్ల బ్రహ్మచారి.. జగద్గిరిగుట్ట పరిధిలోని హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. బ్రహ్మచారికి మూడేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది.
వడ్రంగి పని చేసుకుంటూ జీవిస్తున్న బ్రహ్మచారి-మౌనిక దంపతులు 2నెలలుగా ఉపాధి దొరక్క ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో గత రాత్రి వీరిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి:
