Vikarabad missing case: ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం

author img

By

Published : Jun 27, 2022, 3:13 PM IST

Vikarabad  missing case

Vikarabad missing case: రెండు రోజులుగా ఉత్కంఠకు దారితీసిన బీఎస్పీ నేత అదృశ్యం మిస్టరీ వీడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు వారిని గుర్తించారు. యూపీలోని వారణాసిలో కుమార్తెలతో సహా సత్యమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం అదృశ్యమైన వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి ఆచూకీ పోలీసులు గుర్తించారు. యూపీలోని వారణాసిలో కుమార్తెలతో సహా అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్​కు తెరపడింది. ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు తాండూరు పోలీసులు తెలిపారు. అయితే తన భార్య ఆచూకీ కనిపించడం లేదంటూ 3 నెలల క్రితం సత్యమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సత్యమూర్తి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తన భార్య ఆచూకీ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న వీడియోలో స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం లేఖ రాసి ఇంట్లో నుంచి సత్యమూర్తి భార్య అన్నపూర్ణ వెళ్లిపోయింది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో ఇంట్లో నుంచి వెళ్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటానని అన్నపూర్ణ లేఖలో వెల్లడించింది. అయితే తన భార్య అదృశ్యం కేసు వెనక పెద్దవాళ్ల హస్తం ఉందని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని సత్యమూర్తి ఆరోపింంచారు.

అసలేమైందంటే..: వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి భార్య అన్నపూర్ణ మూడు నెలల కిందట అదృశ్యమయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి అదృశ్యమయ్యారు. తాండూర్​లోని తన నివాసానికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్లు కూడా కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు.. కూతుళ్లతో కలిసి సత్యం రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోలో ఉద్వేగంతో వాళ్లు మాట్లాడిన మాటలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.

తన భార్య అదృశ్యం కేసు వెనక పెద్దవాళ్ల హస్తం ఉందని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని సత్యం తెలిపారు. వాటన్నింటిని పోలీసులకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పకపోతే తన ఇద్దరు కూతుళ్లతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తమ మృతదేహాలకు సంబంధించిన లొకేషన్​ను సోషల్ మీడియాలో తెలియజేస్తానని తెలిపారు. వాళ్ల సెల్ఫీ వీడియో వైరల్​ కావటం.. అందులో రెండు రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే చనిపోతానని చెప్పటం.. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.