Beggar Murder: వైట్‌నర్ మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య
Updated on: Nov 6, 2021, 8:27 PM IST

Beggar Murder: వైట్‌నర్ మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య
Updated on: Nov 6, 2021, 8:27 PM IST
19:14 November 06
Beggar Murder: వైట్‌నర్ మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వైట్‌నర్ మత్తులో ఓ యాచకుడిని మరో యాచకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. నాంపల్లిలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం పక్క వీధిలో ఫుట్‌పాత్‌పై వైట్‌నర్ తీసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మరో వ్యక్తిని కత్తిలో పొడిచి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే నాలుగు రోజుల క్రితం హాబీబ్ నగర్, నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఇలాంటి తరహాలో హత్యలు జరిగాయి. మత్తుకు బానిసలైన కొందరు దండగులు ఇద్దరు యాచకులను దారుణంగా ఫుట్‌పాత్‌పైనే హత్య చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం.. మరో ఘటన మరవకముందే హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా హత్యలు జరగుతుండడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇదీ చూడండి:
హైదరాబాద్‌లో ఇద్దరు యాచకుల దారుణ హత్య
