actress shalu chourasiya case accused: నటి చౌరాసియా కేసు నిందితుడు బాబుపై మరో ఫిర్యాదు

author img

By

Published : Nov 21, 2021, 2:04 PM IST

Updated : Nov 21, 2021, 2:39 PM IST

Actress shalu chourasiya case, Attack on Shalu Chourasiya

14:01 November 21

మరో యువతిపైనా చౌరాసియా కేసు నిందితుడి దాడికి యత్నం

సినీ నటి షాలూ చౌరసియాపై దాడికిశ్(Attack on Shalu Chourasiya) పాల్పడిన నిందితుడు కొమ్ముబాబుపై... ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 2వ తేదీన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికదాడికి పాల్పడతానంటూ బెదిరించాడని తెలిపారు. రూ. 2,500 లాక్కున్నాడని బాధితురాలు వెల్లడించారు. భయంతో పోలీసులకు అప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. నిందితుడు అరెస్ట్‌ కావటంతో రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

నటి షాలూ చౌరసియాపై దాడి..

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద దుండగుడు నటి షాలూ చౌరాసియాపై దాడి చేసి పారిపోయాడు. ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. నటిపై దాడి (Shalu Chourasiya case details) చేసిన తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతని కదలికలను గమనించారు. నటికి పరిచయస్తులే దాడి (Shalu Chourasiya incident) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి.. అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు చెప్పిన అంజనీ కుమార్

కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి కేసును(Shalu chourasiya case news) పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న చౌరాసియాపై లైంగిక దాడి చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్న కొమ్ము బాబు.. దోపిడీకి ప్రయత్నించి.. అసభ్యంగా ప్రవర్తించాడని అంజనీ కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు.... మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. సినిమా సెట్స్‌లో సహాయ కార్మికుడిగా చేసేవాడని పేర్కొన్నారు. కరోనా సమయంలో పనులు లేక సొంతూరుకు వెళ్లిన బాబు ఆర్నెళ్ల క్రితం నగరానికి వచ్చి రోజువారి కూలిపని చేస్తున్నాడు. డబ్బులు సరిపోకపోవడతంతో దోపిడీలు చేయడం మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. బాబుకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

గత నేర చరిత్ర..

2019 డిసెంబర్‌లో గోల్కొండ పీఎస్ పరిధిలో చరవాణి చోరీ కేసులో బాబు జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనూ కేబీఆర్ పార్కులో ఓ మహిళ చరవాణి లాక్కునేందుకు ప్రయత్నించగా... ప్రతిఘటించి అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకుంది. నటి చౌరాసియాపై దాడి ఘటనలోనూ నిందితుడు ఆమె చరవాణి లాక్కొని ఇందిరానగర్ సమీపంలో స్విచాఫ్ చేశాడు. పోలీసులు యూసూఫ్ గూడ, కృష్ణానగర్, బంజారాహిల్స్ కు చెందిన దాదాపు 80మంది పాతనేరస్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి నిందితుడు బాబును అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: Actress shalu chourasiya: 'కేబీఆర్​ పార్క్​లో లైంగిక దాడికి యత్నించాడు'
 

Last Updated :Nov 21, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.