అనిశా వలలో అవినీతి చేప.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎక్సైజ్ సీఐ

author img

By

Published : Jun 14, 2022, 8:14 PM IST

ACB ARRESTED HALIYA EXCISE CI

ACB Raids: మరో అవినీతి అధికారి అనిశా వలకు చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా హాలియా ఎక్సైజ్ సీఐను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతనికి సంబంధించిన నివాసాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

ACB Raids: అబ్కారీశాఖలో అవినీతి చేపను అనిశా అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనిశా అధికారులు నల్గొండ జిల్లా హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్​రావును అదుపులోకి తీసుకున్నారు. వైన్స్ షాప్ నిర్వహణ కోసం 8 నెలలకు గాను రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఏక కాలంలో హైదరాబాద్​లోని కొత్తపేటలో ఉన్న అతని నివాసంలో సోదాలు జరుపుతున్నట్లు కృష్ణ గౌడ్ వెల్లడించారు.

హైదరాబాద్ సరూర్​నగర్​లో ఉండే నూకల విద్యాసాగర్ రెడ్డికి భార్య సునీత పేరు మీద లాటరీ పద్ధతి ద్వారా 2021 డిసెంబర్​లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్​లో వైన్స్ షాప్ వచ్చింది. అప్పటి నుంచి షాప్ సక్రమంగా నడవాలంటే నెలకు 25 వేల రూపాయలు ఇవ్వాలని హాలియా ఎక్సైజ్ సిఐ యమునాధర్​ రావు డిమాండ్ చేశాడు. దాంతో అతని వేధింపులకు భయపడిన విద్యాసాగర్ రెడ్డి 8 నెలలకు గాను 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో ఈ రోజు విద్యాసాగర్ రెడ్డి నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద సీఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టడాన్ని చూసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఇవీ చదవండి:పారిపోయిన ప్రేమజంట.. యువకులను చితకబాదిన సర్పంచ్.. మనస్తాపంతో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.